Sunday, March 3, 2024
Homeసినిమాఅనన్య నాగళ్ల కీలక పాత్రలో 'తంత్ర'

అనన్య నాగళ్ల కీలక పాత్రలో ‘తంత్ర’

అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘తంత్ర’. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. ‘మగధీర’లో షేర్‌ఖాన్‌ లాంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. మరో కీలక పాత్రలో సలోని ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తోంది.

మన తంత్ర శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలు ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాస్‌ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. “ఫిమేల్ ఓరియెంటెడ్‌ లైన్‌తో రూపొందుతున్న హారర్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాధల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది” అని దర్శకనిర్మాతలు తెలిపారు. టెంపర్‌ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి క్రేజీ ఫెలో, మైల్స్‌ ఆఫ్‌ లవ్‌ చిత్రాలకు సంగీతం అందించిన ఆర్‌ఆర్‌ ధృవన్‌ సంగీతం అందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్