ఫెబ్రవరి 19 నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే మహిళల టి 20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. తెలుగమ్మాయి అంజలి శర్వాణికి చోటు దక్కింది. జట్టు ఓపెనర్ గా ఉన్న సబ్బినేని మేఘనను స్టాండ్ బై గా ఎంపిక చేశారు. ఈ వరల్డ్ కప్ కంటే ముందు ఇండియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే ముక్కోణపు సిరీస్ కు కూడా జట్టును ప్రకటించారు.
జనవరి 19 నుంచి మొదలు కానున్న ముక్కోణపు సిరీస్ కు కూడా సౌతాఫ్రికా ఆతిథ్యం ఇస్తోంది
ముక్కోణపు సిరీస్: హర్మన్ ప్రీత్ సింగ్ (కెప్టెన్), స్మృతి మందానా (వైస్ కెప్టెన్), అంజలి శర్వాణి, యాస్తిక భాటియా, జెమీమా రోడ్రిగ్యూస్, హర్లిన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్, సుష్మ వర్మ, అమన్ జోధ్ కౌర్, పూజా వస్త్రాకర్, సబ్బినేని మేఘన, స్నేహ్ రానా, శిఖా పాండే
టి 20 వరల్డ్ కప్ : హర్మన్ ప్రీత్ సింగ్ (కెప్టెన్), స్మృతి మందానా (వైస్ కెప్టెన్), అంజలి శర్వాణి, యస్తిక భాటియా, షఫాలీ వర్మ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్యూస్, హర్లిన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, పూజా వస్త్రాకర్, శిఖా పాండే
స్టాండ్ బై: మేఘనా సింగ్, సబ్బినేని మేఘన, స్నేహ్ రానా
పూజా వస్త్రాకర్ ఫిట్ నెస్ ను అంచనా వేసిన తర్వాతే ఆమెను జట్టులో ఉంచేదీ లేనిదీ నిర్ణయిస్తారు.