Saturday, January 18, 2025
Homeసినిమాబాల‌య్య మూవీ టైటిల్ ఇదే!

బాల‌య్య మూవీ టైటిల్ ఇదే!

Title Soon: న‌ట సింహ నంద‌మూరి బాల‌కృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన త‌ర్వాత మ‌రెంత స్పీడుగా సినిమాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ తో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఇందులో బాల‌య్య స‌ర‌స‌న అందాల తార శృతిహాస‌న్ న‌టిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ నటుడు దునియా విజయ్, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

అలాగే మ్యూజిక్ సెన్సేషనల్ తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎన్.బి.కె 107 అనేది వ‌ర్కింగ్ టైటిల్. ఇక టైటిల్ విష‌యానికి వ‌స్తే.. ‘జై బాల‌య్య’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఆ టైటిల్ కాకుండా అన్న గారు అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నార‌ట‌. నంద‌మూరి తార‌క రామారావును అన్న గారు అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు ప్రేక్ష‌కాభిమానులు.

ఈ టైటిల్ అయితే.. క‌రెక్ట్ గా సెట్ అవుతుంద‌ని ఈ టైటిల్ నే ఫిక్స్ చేశార‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ఎప్పుడు ప్ర‌క‌టిస్తారంటే.. జూన్ 10న బాల‌య్య పుట్టిన‌రోజు. ఆ రోజున ఈ మూవీ టైటిల్ ను అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేస్తార‌ని టాక్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్