Monday, June 17, 2024
Homeసినిమాకొత్త సినిమా ప్రకటించిన చిరు. ఇంతకీ ఎవరితో..?

కొత్త సినిమా ప్రకటించిన చిరు. ఇంతకీ ఎవరితో..?

చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ చిత్రానికి మెహర్ రమేష్‌ డైరెక్టర్. చిరుకు జంటగా తమన్నా నటిస్తే.. చిరుకు చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది. ఇందులో సుశాంత్ గెస్ట్ రోల్ చేయడం విశేషం. ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ వర్క్ ను కూడా చిరు కంప్లీట్ చేశారు. ఇటీవల భోళా శంకర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి వరుసగా అప్ డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆగష్టు 11న భోళా శంకర్ మూవీ విడుదల కానుంది. మరి.. చిరు నెక్ట్స్ ఏంటి..? అంటే కళ్యాణ్‌ కృష్ణతో ఓ సినిమా, మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో ఓ మరో సినిమా చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతుంది కానీ.. ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే.. భోళా శంకర్ మూవీ డబ్బింగ్ వర్క్ కంప్లీట్ చేసినట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలియచేసిన చిరు.. తాజాగా తన భార్య సురేఖతో ఓ చిన్న వెకేషన్ కి వెళ్తునున్నట్టుగా కూడా తెలియచేశారు. మరి తమ ఇద్దరి పలు ఫోటోలు కూడా షేర్ చేసి తమ హ్యాపీ మూమెంట్స్ ని అయితే షేర్ చేశారు.

ఇక ఈ వెకేషన్ తర్వాత అయితే వచ్చి నెక్స్ట్ చిత్రాన్ని అనౌన్స్ చేస్తానని కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ని ఈ పోస్ట్ ద్వారా తెలియచేశారు. అలాగే ఈ చిత్రం ఒక హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని.. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుందని ప్రకటించారు. అయితే.. దర్శకుడు ఎవరు అనేది మాత్రం ప్రకటించలేదు. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడని టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే.. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్