Sunday, January 19, 2025
Homeసినిమా‘భగత్ సింగ్ నగర్'  నుంచి మ‌రో పాట

‘భగత్ సింగ్ నగర్’  నుంచి మ‌రో పాట

Bhagat Singh Nagar Song released :
గ్రేట్ ఇండియా మీడియాహౌస్ పతాకంపై విదార్థ్, ధృవిక హీరోహీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తులు నిర్మిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమాలోని ‘యుగ యుగమైన తరగని వేదన’  పాటను  చిత్ర యూనిట్  విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వాలాజా గౌరి, రమేష్ ఉడత్తులు మాట్లాడుతూ “ఇంతకు ముందు మేము విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర యూనిట్ సమక్షంలో ఈ పాటను విడుదల చేస్తున్నాం. ప్రొడ్యూసర్ గా నాకు ఇంత మంచి టీమ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ గానీ, ఆర్టిస్టులు గానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్ లో కమిట్మెంట్ ప్రకారం చాలా ఇంట్రెస్ట్ తో ఈ సినిమా చేశారు. నేను లండన్ ఉన్నా కూడా నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ నాకు తెలియజేస్తున్న దర్శకుడికి నా ధన్యవాదాలు. ఇంతకుముందు మేము చేసిన పాట లాగే ఈ ఈ పాట కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. మరిన్ని విషయాలు త్వరలో తెలియజేస్తాం” అన్నారు.

వాలాజా క్రాంతి మాట్లాడుతూ  “ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎంతో అవసరం.  మాలాంటి కొత్తవారికి అవకాశం కల్పించే నిర్మాత దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఏది అడిగినా కాదనకుండా తెలుసుకుని వెంటనే మాకు కావలసిన ఏర్పాట్లు చేసేవారు. త్వరలో ఈ నిర్మాతలు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Also Read :  ‘భగత్ సింగ్ నగర్’ పాట విడుదల చేసిన శ్రీకాంత్

RELATED ARTICLES

Most Popular

న్యూస్