Saturday, January 18, 2025
Homeసినిమామత్తుకళ్ల సుందరి మళ్లీ దార్లోపడేనా?

మత్తుకళ్ల సుందరి మళ్లీ దార్లోపడేనా?

తెలుగు తెరపైకి పరిచమైన అందమైన కథానాయికలలో ఎవరి ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. కొంతమందిలో నవ్వు ప్రత్యేకమైన ఆకర్షణగా  కనిపిస్తే .. మరి కొందరిలో కళ్లు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. అటు నవ్వు .. ఇటు కళ్లు .. ఈ రెండింటినీ ప్రధానమైన ఆకర్షణగా కలిగిన బ్యూటీలు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటివారి జాబితాలో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరుగా కనిపిస్తుంది. 2011లో మలయాళ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, నాని ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది.

ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ ను చూసిన కుర్రాళ్లంతా, ఊహాలోకంలో తేలిపోయారు. ఆమె మత్తుకళ్లపై కలలు కంటూ కాలం గడిపేశారు. యూత్ లో ఒక్కసారిగా ఆమెకి క్రేజ్ పెరిగిపోయింది. ఆ క్రేజ్ కి తగినట్టుగానే ఆమెకి అవకాశాలు వచ్చి పడ్డాయి. చాలా తక్కువ సమయంలోనే ఆమె అల్లు అర్జున్ .. పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల జోడీగా ఛాన్స్ కొట్టేసింది. అయితే దురదృష్టం కొద్దీ ఆ సినిమాలు ఆశించినస్థాయిలో ఆడకపోవడం వలన, సహజంగానే ఆమె వెనుకబడిపోయింది.

‘శైలజా రెడ్డి అల్లుడు’ .. ‘అల్లుడు అదుర్స్’ వంటి హిట్ ఫార్ములా సినిమాలు సైతం ఆమెకి సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. ఇక చివరిగా చేసిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా కూడా ఆమె అభిమానులను నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలోనే ఆమె రవితేజ సరసన ‘రావణాసుర’ సినిమాలో అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ ఉన్నప్పటికీ, ఒక అడుగు ఈ బ్యూటీనే ముందుంది. ఈ నెల 7వ తేదీన థియేటర్స్ కి ఈ సినిమా రానుంది. ఈ సినిమాతోనైనా ఆమె కెరియర్ మళ్లీ దార్లోపడుతుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్