Friday, April 4, 2025
Homeసినిమాఅను’పై ఆమని ఆశలు

అను’పై ఆమని ఆశలు

కార్తిక్ రాజు, ప్రశాంత్ కార్తి, మిస్తి చక్రవర్తి, ఆమని, దేవి ప్రసాద్, భీమినేని శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రల్లో అవి క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘అను’. తేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద సందీప్ గోపిశెట్టి ఈ సినిమాకు దర్శక నిర్మాత బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి గుంపిన లైన్ ప్రొడ్యూసర్.   ప్రెస్ మీట్‌లో చిత్ర విశేషాలను యూనిట్ సభ్యులు పంచుకున్నారు.

సీనియర్ నటి ఆమని మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చింది. నేను ఇందులో చాలా మంచి పాత్రను, కొత్త కారెక్టర్‌ను పోషించాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత సందీప్‌కు థాంక్స్. ఎప్పుడూ టెన్షన్ పడలేదు. సినిమాను బాగా తీశారు. కరోనా వల్ల కాస్త సమస్యలు వచ్చినా, ఆలస్యం అయినా ఎప్పుడూ టెన్షన్ పడలేదు. మంచి సందేశాత్మక చిత్రమిది. సినిమాను అందరూ ఆదరించాలి. మీడియా, ఆడియెన్స్ సహకారం ఈ సినిమాకి ఉండాలి. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

దర్శక నిర్మాత సందీప్ గోపిశెట్టి మాట్లాడుతూ.. ‘ఇది నా మొదటి చిత్రం. ఆమని, దేవి ప్రసాద్, భీమినేని శ్రీనివాసరావు లాంటి పెద్ద వాళ్లందరూ నటించారు. వాళ్లందరికీ థాంక్స్. ఈ రోజు హీరో హీరోయిన్లు వేరే షూటింగ్ ఉండటంతో రాలేదు. ఈ మూవీ అద్భుతంగా వచ్చింది. సెప్టెంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్