Saturday, January 18, 2025
Homeసినిమాఛాలెంజ్ విసిరే పాత్రల కోసం చూస్తున్నా - అనుపమ పరమేశ్వరన్.

ఛాలెంజ్ విసిరే పాత్రల కోసం చూస్తున్నా – అనుపమ పరమేశ్వరన్.

దక్షిణాదిన ఓ వైపు హీరోయిన్ గా … మరోవైపు లేడీ ప్రాధాన్య చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న నటి అనుపమ పరమేశ్వరన్. ముక్కుసూటితనం, ముగ్ద మనోహర రూపం ఆమె సొంతం. కోవిడ్ తరువాత స్పీడ్ పెంచిన ఈ భామ రౌడీ బాయ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు.” కార్తి కేయ 2″ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ తో కలిసి, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన “కార్తికేయ‌ 2” చిత్రాన్ని టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 13 న థియేటర్స్ లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్బంగా చిత్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పాత్రికేయ మిత్రులతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…

“ఈ సినిమాలో నా పాత్రకు థియేటర్లలో  ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అది నాకు మంచి ఎనర్జీ ని ఇచ్చినట్లు అనిపించింది. ఈ సినిమా చూసిన వారందరూ ఎంజాయ్ చేస్తూ బాగుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది.
చందు గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యి ఈ సినిమా చేద్దాం అనుకున్నాను. ప్రతి కథకు కంటెంట్ అనేది చాలా ముఖ్యం, చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ ఉండదు మనుషుల్లో ఉన్న మంచితనాన్ని నేను దైవంగా భావిస్తాను. ఈ సినిమాలో కృష్ణతత్త్వం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా కథ నచ్చడంతో నాకొచ్చిన కొన్ని ఇతర ప్రాజెక్ట్స్ ను కూడా వదులుకున్నాను.

Karthikeya 2 13th August

మంచు గడ్డ కట్టే ప్రదేశంలో… లొకేషన్స్ మారుతూ షూటింగ్ చేయడం వాళ్ళ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందరూ జేమ్స్ బాండ్ టైప్ లో ఎంట్రీ ఇచ్చావు అంటున్నారు. అలాగే కొన్ని చోట్ల హీరోను డామినేట్ చేసే విధంగా నా పాత్ర ఉందని చెబుతున్నారు, కానీ ఈ విషయం వాస్తవం కాదు. అయితే కథకు తగినట్టుగానే నా పాత్ర ఉంటుంది. రౌడీ బాయ్స్ లో ఎక్కువ గ్లామర్ గా వుండాలని చేసిన పాత్ర కాదు.  సిచ్యువేషన్ డిమాండ్ మేరకు ముద్దు సీన్స్ లలో నటించాను.

పదే పదే మహిళలు వెనుకబడి ఉన్నారు అని చెప్పడం వలన ఇంకా మహిళలు వెనుకబడి ఉన్నారనే భావనకు గురి చేస్తుంది. ఇప్పుడు మహిళలు మగవారితో సమానంగా ముందుకు వెళుతున్నారు. నా చిన్నప్పుడు స్కూటీ పై ఆగష్టు 15 న ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకొని తిరిగేదాన్ని. నేను ఎక్స్పరమెంటల్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాను. నాకొచ్చే పాత్రలు ఛాలెంజింగ్ ఉండాలి అలాంటి పాత్రలు నాకు నచ్చుతాయి. ఒక ఆర్టిస్ట్ గా ఎన్ని లాంగ్వేజెస్ కుదిరితే అన్ని లాంగ్వేజెస్ చేయాలని ఉంటుంది. అది నాకు నిర్మాతకు , దర్శకులకు కూడా స్పాన్ పెరుగుతుంది.

కార్తికేయ నెక్స్ట్ పార్ట్ లో నా పాత్ర ఉంటుందో లేదో తెలియదు. దాని గురించి నేను దర్శక, నిర్మాతలను కూడా అడగలేదు. ఇంతకు ముందు టాలీవుడ్ అంతా బాలీవుడ్ వైపు చూసేవారు. అయితే ఇప్పుడు రాజమౌళి గారు వచ్చిన తరువాత బాహుబలి, కె. జి. యఫ్ సినిమాలా తరువాత ఆ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు అంతా ఇండియన్ సినిమా అయ్యింది. ప్రస్తుతం రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మరో రెండు చిత్రాలు చర్చల్లో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను. అలాగే 18 పేజెస్ సినిమా వారం రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది.

Also Read : కార్తికేయ-2 విజయంపై నిఖిల్ ఆనందం

RELATED ARTICLES

Most Popular

న్యూస్