Wednesday, May 8, 2024
HomeTrending News70:30 నిష్పత్తిలో పంచండి:ఏపి లేఖ

70:30 నిష్పత్తిలో పంచండి:ఏపి లేఖ

కృష్ణా జలాలను 70:30 నిష్పత్తిలో పంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్ఎంబీ) కి లేఖ రాసింది. రెండవ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారమే నీటి పంపకాలు జరగాలని లేఖలో పేర్కొంది. కేఆర్ఎంబీ  ఛైర్మన్ ఎం.పీ. సింగ్ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈ.ఎన్.సీ.) నారాయణ రెడ్డి  లేఖ రాశారు.

 50:50 నిష్పత్తిలో పంపకాలు జరగాలంటూ తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న వాదన  ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధమని, దీనికి తాము అంగీకరించబోమని లేఖలో స్పష్టం చేసింది. గతంలో సాగు విస్తీర్ణం, ప్రాజెక్టుల ఆధారంగా నీటి కేటాయింపులు జరిగాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు 70, తెలంగాణకు 30 శాతం చొప్పున పంచుతూ నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు.  ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, విభజన చట్టం, గత ట్రిబ్యునల్ ఆదేశాల కాపీలను లేఖతో జత చేశారు. 2021-22 సంవత్సరానికి 70:30 నిష్పత్తిలో నీటి పంపకాలు చేస్తూ ఆదేశాలు త్వరితగతిన విడుదల చేయాలని కోరింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్