Sunday, January 19, 2025
HomeTrending Newsకర్నూలుకు లోకాయుక్త, హెచ్.ఆర్.సీ.

కర్నూలుకు లోకాయుక్త, హెచ్.ఆర్.సీ.

హైకోర్టు సూచన పరిగణనలోకి తీసుకుంటూ హైదరాబాద్ లో ఉన్న ఏపీ లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం వెలగపూడి సచివాలయంలో నేడు సమావేశమైంది. అనంతరం మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వివరించారు. విద్యావ్యవస్థ బలోపేతానికి విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నామని, దీనికోసం పలు కీలక చర్యలు తీసుకుంటున్నామని నాని వివరించారు.

నాని మీడియా సమావేశంలో ముఖ్యాంశాలు:

  • నాడు-నేడు కింద 34 వేల పాఠశాలలు బాగు చేస్తున్నాం
  • విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తున్నాం
  • రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో తెలుగు సబ్జెక్టు తప్పనిసరి
  • తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో టెక్స్ట్ పుస్తకాలు ముద్రణ
  • రెండు భాషల్లో పుస్తకాలు ముద్రిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే
  • అత్యంత పేదవారు కూడా తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివించాలని కోరుకుంటున్నారు
  • అందుకోసమే విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, విద్యార్ధులకు నాణ్యతతో కూడిన విద్య అందించాలని నిర్ణయం
  • జగన్ సిఎం అయిన తరువాత ఆరు లక్షల 28వేల మంది ప్రభుత్వ పాతశాలల్లో ఎన్ రోల్ చేసుకున్నారు
  • ఆగస్ట్ 16న జగనన్న విద్యాకానుక పథకం అమలు చేస్తాం
  • ఆగస్ట్ 10న మూడో విడత నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తాం
  • 4 లక్షల మంది నేతన్నలకు ఒక్కొక్కరికీ 24 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం, దీనికోసం రూ. 200 కోట్లు కేటాయింపు
  • ఆగస్ట్ 24న అగ్రిగోల్డ్ లబ్దిదారులకు ఆర్ధిక సాయం
  • న్యాయాధికారుల సూచన మేరకు 10-20వేల లోపు డిపాజిట్ చేసిన లబ్ధిదారులు 4  లక్షల మంది ఉన్నారు. వీరికి రూ. 500  కోట్ల సాయం
  • ప్రస్తుత రబీలో ఇప్పటివరకూ 35, 43,909 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం
  • 6634.63 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉంటే 6344.93కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేశాం.
  • ఇంకా 289.70 కోట్ల రూపాయలు మాత్రమె చెల్లించాల్సి ఉంది, దీన్ని వెంటనే చెల్లించమని సిఎం జగన్ ఆదేశించారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్