Sunday, November 3, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఆక్సిజన్ కోటా పెంచండి : జగన్ వినతి

ఆక్సిజన్ కోటా పెంచండి : జగన్ వినతి

రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా పెంచాలని, వాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడికి లేఖ రాశారు.

ఓడిశా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఆంధ్ర ప్రదేశ్ కు సరఫరా చేస్తున్నారని… దాన్ని 910 మెట్రిక్ టన్నులకు పెంచాలని లేఖలో కోరారు. కోవిడ్ రోగుల సంఖ్య లక్షా 87 వేలకు చేరుకుందని, ప్రస్తుతం అందిస్తున్న ఆక్సిజన్ సరిపోవడం లేదని లేఖలో పేర్కొన్నారు.

చెన్నై నుంచి రావాల్సిన ఆక్సిజన్ సరఫరాలో జాప్యం కారణంగా తిరుపతి రుయా ఆస్పత్రిలో 11 మంది రోగులు చనిపోయిన విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకు వచ్చారు. రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరా కోసం మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ (ఏం ఎల్ ఓ ) టాంకర్ లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేందుకు టెక్నాలజీ బదిలీ చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రధానికి రాసిన మరో లేఖలో జగన్ కోరారు. తక్కువ సమయంలో ఎక్కువ వాక్సిన్లు ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరి అవుతుందని, ఈ విషయమై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్