Sunday, January 19, 2025
HomeTrending Newsభరత్ కు జగన్, చంద్రబాబు అభినందనలు

భరత్ కు జగన్, చంద్రబాబు అభినందనలు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన కెఎస్ భరత్ తన కెరీర్ లో తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు వారు తమ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

“ఆస్ట్రేలియాతో నేడు మొదలైన మ్యాచ్ ద్వారా టెస్ట్ కెరీర్ లో ఆరంగ్రేటం చేస్తున్న భరత్ కు శుభాకాంక్షలు, అభినందనలు, తెలుగు పతాకం ఇలాగే ఎగరాలి” అంటూ సిఎం జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.  ఇండియా క్యాప్ ధరించిన తరువాత భరత్ తన తల్లి ఆశీర్వాదం అందుకుంటున్న ఫోటోను కూడా జత చేశారు.

“నేడు ఆస్ట్రేలియా తో జరుగుతోన్న  తొలి టెస్ట్ మ్యాచ్ ద్వారా మన ఆటగాడు భరత్ ఆరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసి చాలా సంతోషించాను, అతనికి అభినందనలు,  అతడు దేశం గర్వించే ఆటగాడిగా ఎదగాలని కోరుకుంటున్నా” అంటూ చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు.

Also Read : IND Vs AUS: భరత్ కు క్యాప్ – ఇండియా దూకుడు

RELATED ARTICLES

Most Popular

న్యూస్