Sunday, January 19, 2025
HomeTrending Newsరాష్ట్రంలో 3 పీడియాట్రిక్ సెంటర్లు: సిఎం జగన్

రాష్ట్రంలో 3 పీడియాట్రిక్ సెంటర్లు: సిఎం జగన్

కరోనా మూడో దశపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అవసరమయ్యే మందులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటుఆస్పత్రుల్లో కూడా తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రతి ఆస్పత్రిలో పీడియాట్రిక్ వార్డులు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నివారణ చర్యలు, మూడో వేవ్ పై  అధికారులతో  ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

వైజాగ్, గుంటూరు-విజయవాడ, తిరుపతిలలో ఒక్కొక్కటి 180  కోట్ల రూపాయ చొప్పున రాష్ట్రంలో  మూడు పీడియాట్రిక్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జగన్ అధికారులకు నిర్దేశించారు. ఈ కేంద్రాల్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు ఉండేలా  త్వరగా ప్రణాళికలు సిద్ధంచేసి వెంటనే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల్లో తగిన మౌలిక వసతులు కల్పించాలన్నారు. అనుభవజ్ఞులైన పిల్లల డాక్టర్లను గుర్తించి వారి సేవలను వినియోగించుకునేలా చూడాలని కోరారు.

ప్రస్తుతం మనం ఏర్పాటు చేయబోయే పీడియాట్రిక్ సెంటర్లు భవిష్యత్తులో మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వాడుకోవచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్