Thursday, April 3, 2025
HomeTrending NewsKottu Satyanarayana: జన్మభూమి కమిటీలపై ఎందుకు మాట్లాడలేదు?

Kottu Satyanarayana: జన్మభూమి కమిటీలపై ఎందుకు మాట్లాడలేదు?

సిఎం జగన్ ను తిట్టడానికే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నట్లు ఉందని డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు.  గతంలో ఉచిత ఇసుక పేరుతో దాదాపు 40వేల కోట్లు దోచుకున్నారని, దీనిలో పెద్దాయన, చినబాబు వాటా వారికి వెళ్లాలని ఎమ్మెల్యేలే మాట్లాడుకున్న సంగతి అందరం చూశామని గుర్తు చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో విచ్చల విడిగా అవినీతి జరిగితే నాడు మాట్లాడని పవన్ కళ్యాణ్ సేవా భావంతో పనిచేస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు.

పవన్ చాలా దారుణంగా మాట్లాడుతున్నారని, మన చెల్లెళ్ళను, తమ్ముళ్ళను ఇలా కించపరచడం సరికాతని కొట్టు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరు మాట్లాడమంటే ఇలా అంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా వాలంటీర్లను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్