Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్ఏపీ పోలీసులకు అవార్డులు-డిజిపి అభినందన

ఏపీ పోలీసులకు అవార్డులు-డిజిపి అభినందన

జాతీయ స్థాయిలో జరిగిన వాలీ బాల్ క్లస్టర్-2022 లోని యోగా, సెపక్‌ తక్రాలో పతకాలు సాధించిన ఏపీ పోలీస్ క్రీడకారులను రాష్ట్ర డిజిపి డా. కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు. దక్షిణ భారతదేశం నుండి ఉత్తమ ప్రతిభ కనబరిచి  బంగారు, వెండి పతకాలు గెలుపొందారు.

డిసెంబర్ 10 నుండి 15 వరకు పంజాబ్ లోని జలంధర్ లో నిర్వహించిన 71వ  జాతీయ స్థాయి వాలీ బాల్ క్లస్టర్-2022 లోని యోగా, సెపక్‌ తక్రా పోటీలలో దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత రాష్ట్రాలు, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ కు చెందిన మొత్తం  2770 మంది క్రీడాకారులు పాల్గొనగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఐ‌జి ఎల్.కే.వి రంగారావు నేతృత్వంలో పోలీసు క్రీడాకారుల బృందం ఈ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు.

యోగా(మహిళలు):
యోగా 35-55 సంవత్సరాల మహిళల గ్రూప్ విభాగంలో బంగారు పతకం సాధించగా… సింగిల్స్ విభాగంలో విశాఖపట్నం కు చెందిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ మహిళా అధికారిణి కళ్యాణి కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.

యోగా(పురుషులు):
యోగా 35-55 సంవత్సరాల పురుషుల గ్రూప్ విభాగంలో ఏపీ పోలీస్ జట్టు; వ్యక్తిగత విభాగంలో రాజానగరం పోలీసు స్టేషన్ కు చెందిన 1989 బ్యాచ్ ఎఎస్ఐ ఎ.రాజా ప్రకాష్ బాబు మూడోస్థానంలో నిలిచి కాంస్యం గెల్చుకున్నారు.

SEPAKTAKRAW (సెపక్‌ తక్రా):
జలంధర్ లో నిర్వహించిన సెపక్‌ తక్రా పురుషుల డబుల్స్ లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన జట్టు Bronze మెడల్ ను కైవసం చేసుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్