Monday, February 24, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఆయనకో విధానం లేదు : డిప్యుటీ సిఎం

ఆయనకో విధానం లేదు : డిప్యుటీ సిఎం

పవన్ కళ్యాణ్ ను ఓ నటుడిగానే ప్రజలు ఆదరిస్తారని, నాయకుడిగా కాదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి అన్నారు. పవన్ ఉద్రేకపూరితంగా ఉంటారని, రాజకీయాల్లో ఆయనకు ఓ విధానం అంటూ ఏమీ లేదని…. ఎప్పుడు ఎవరితో జత కడతారో, ఎందుకు కడతారో ఆయనకే తెలియదని వ్యాఖ్యానించారు.  తిరుమల శ్రీవారిని నారాయణ స్వామి దర్శించుకున్నారు. అనంతరం అయన విలేకరులతో మాట్లాడారు.

మహిళలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ తనవల్ల అన్యాయమైన మహిళలకు ఏం న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కులం కార్డుతో ఓట్లు అడిగే వారిని ప్రజలు తిరస్కరిస్తారని అయన అభిప్రాయపడ్డారు. నవరత్నాలపై పవన్ చేసిన వ్యాఖ్యలపై డిప్యుటీ సిఎం స్పందిస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం తప్పా అని ప్రశ్నించారు. సంక్షేమానికి అడ్డుపడితే ప్రజలే పవన్ పై తిరగబడతారని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్