Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు

కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు

రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణలో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనల్లో మార్పులు చేశారు.  తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 గంటలనుంచి రాత్రి 7గంటలవరకూ కర్ఫ్యూ సడలింపులు ఇచ్చారు.  సాయంత్రం 6 గంటలకే దుకాణాల మూసివేయాలని, ఏడు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకూ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. పాజిటివిటీ రేటు 5 శాతం లోపు వచ్చేంతవరకూ ఈ ఆంక్షల కొనసాగుతాయని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో ప్రస్తుతం అమలవుతున్న విధంగానే ఉదయం 6 గంటలనుంచి రాత్రి 10 గంటలవరకూ సడలింపులు అమల్లో ఉంటాయి, రాత్రి 9 గంటలకే దుకాణాల మూసివేయాలి.

సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా థియేటర్లకు అనుమతిచ్చింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణ మండపాలు తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చని తెలియజేసింది. జనం ఉండేచోట కచ్చితంగా సీటుకు సీటుకు మధ్య ఖాళీ తప్పనిసరి అని స్పష్టం చేసింది.  శానిటైజర్, మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి అని పేర్కొంది. కోవిడ్ హెచ్చుతగ్గులను పరిగణలోకి తీసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని  సిఎం జగన్ అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్