Sunday, January 19, 2025
HomeTrending Newsజడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు రద్దు : హైకోర్టు తీర్పు

జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు రద్దు : హైకోర్టు తీర్పు

రాష్ట్రంలో ఇటివల జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదని, కనీసం 4 వారాల పాటు ఎన్నికల కోడ్ అమలు చేయాలన్ని నిబంధనను ఎన్నికల సంఘం పాటించలేదని హైకోర్టు అభిప్రాయ పడింది.

ఆంధ్ర ప్రదేశ్ లో ఏప్రిల్ మొదటి వారంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరిగాయి. గత ఏడాది లోనే ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది, కోవిడ్ కారణంగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ నాటి ఎన్నికన కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన ఎన్నికల కమిషనర్ ఎన్నికల ప్రక్రియను తిరిగి మొదలు పెట్టారు. ప్రక్రియను మొదటినుంచి ప్రారంభించాలని ప్రతిపక్షాలు కోరాయి. ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే కొనసాగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనిపై విపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. కేసును విచారించిన న్యాయస్థానం ఎన్నికలు నిర్వహించి కౌంటింగ్ మాత్రం జరపవద్దని గతంలో ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

కౌంటింగ్ చేపట్టేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వం, ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సింగల్ బెంచ్ ఎన్నికల ప్రక్రియను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్