Monday, February 24, 2025
HomeTrending Newsఆన్ లైన్ టికెట్లపై హైకోర్టు స్టే

ఆన్ లైన్ టికెట్లపై హైకోర్టు స్టే

Another Stay: సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే ఆన్ లైన్ ద్వారా  విక్రయించేలా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 69ని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. తదనంతర చర్యలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.

సినిమా టిక్కెట్లను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సినిమా, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్యవర్తిత్వం ద్వారా ఓ ఏజెన్సీ ని నియమించి ప్రత్యేక గేట్ వే ద్వారా టిక్కెట్లను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించి, దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తూ జీవో 69ని విడుదల చేసింది.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బుక్ మై షో, మల్టీ ప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలు, విజయవాడ సినీ ఎగ్జిబిటర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.  దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తపుబట్టింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్