Sunday, November 24, 2024
HomeTrending Newsకర్నూల్ లో హెచ్ఆర్సీ కార్యాలయం ప్రారంభం

కర్నూల్ లో హెచ్ఆర్సీ కార్యాలయం ప్రారంభం

కరోనా నేపథ్యంలో మరి కొన్ని రోజులపాటు ఆన్ లైన్ లోనే ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మనవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి వెల్లడించారు. బాధితులను స్వయంగా కలుసుకునేందుకు వారానికి ఒకరోజు అందుబాటులో ఉంటామని చెప్పారు. కర్నూలు ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని జస్టిస్ సీతారామమూర్తి నేడు ప్రారంభించారు.

రూమ్ నెంబర్-1లో జస్టిస్ ఎం.సీతారామమూర్తి, రూమ్ నెంబర్-2 లో జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం; రూమ్ నెంబర్-4 లో నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి.శ్రీనివాస రావులకు ఛాంబర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. అంతకు ముందు హెచ్‌ఆర్‌సీ చైర్మన్, సభ్యులకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

గత వారం ఇదే భవనం రూమ్ నంబర్-3 లో రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా, కర్నూలులో ఏపీ లోకాయుక్త, హెచ్ ఆర్ సీ కార్యాలయాల ఏర్పాటు తాము ఇచ్చే తుది తీర్పుకు లోబడే ఉండాలని నిన్న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం అంతిమం కాదని వ్యాఖ్యానించింది. దీనితో ఈ రెండు సంస్థలు శాశ్వతంగా కర్నూలులో కొనసాగుతాయా లేదా అనే అంశంపై స్పష్టత లేదని చెప్పవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్