Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అసెంబ్లీ తరువాత సంపూర్ణ లాక్ డౌన్?

అసెంబ్లీ తరువాత సంపూర్ణ లాక్ డౌన్?

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు పాజిటివిటి రేటు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ సంపూర్ణ లాక్ డౌన్ దిశగా ఆలోచన చేస్తుందని సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఏపీ సర్కార్ కూడా మధ్యాహ్నాం 12 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమలు చేస్తుంది. కానీ దీని వల్ల లాభం లేదని అధికారులు చెప్తున్నారు. మరో వైపు పాజిటివిటి రేటు 10 శాతం దాటితే ఆ జిల్లాల్లో లాక్ డౌన్ విధించాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది. కానీ ఏపీలో పాజిటివిటి రేటు 20 శాతం దాటుతోంది.

విశాఖ, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ తప్పా మరో మార్గం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ కు అధికారులు దీనిని సూచించినట్టు సమాచారం. మే 20న అసెంబ్లీ ఒక్క రోజు పాటు సమావేశం కానుంది. ఇది ముగిసిన తర్వాత ఏ క్షణమైనా ఏపీలో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్