Sunday, January 19, 2025
HomeTrending NewsHarish Rao- Karumuri: హరీష్ ఓసారి వచ్చి చూడు: కారుమూరి

Harish Rao- Karumuri: హరీష్ ఓసారి వచ్చి చూడు: కారుమూరి

తెలంగాణ మంత్రి హరీష్ రావు ఒకసారి ఇక్కడకు వచ్చి తెలుసుకొని మాట్లాడాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరరావు సూచించారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణను అప్పజెప్పారని, అయినా ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఒక పెద్ద వాన పడితే రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోవాలని, గతంలో వానలు పడి ఇళ్ళు మునిగిపోతే కొంతమందికి పరిహారం ఇచ్చి మిగిలినవారికి ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. నిన్న జరిగిన ఓ సమావేశంలో ‘ఏపీలో ఏముంది ఇక్కడ ఓటు హక్కు నమోదు చేసుకోవాల’ని కార్మికులకు హరీష్ రావు చెప్పడాన్ని కారుమూరి తప్పు బట్టారు. మీ గ్రామాల్లో రోడ్ల సంగతి చూసుకోవాలంటూ సలహా ఇచ్చారు. మీరు ఏ రకంగా రాష్ట్రాన్ని తగలేసుకున్నారో మీ ప్రతిపక్షాలే చెబుతున్నాయంటూ ఎదురుదాడి చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ ను సిఎం జగన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, ప్రభుత్వ స్కూళ్ళలో నాడు-నేడు, గోరుముద్ద పథకాల గురించి ఎన్నో రాష్ట్రాలు తెలుసుకొని అమలు చేస్తున్నారని చెప్పారు. విద్యారంగంలో గతంలో 14వ స్థానంలో ఉంటే ఇప్పుడు మూడో ప్లేస్ లో ఉన్నామని, ఇది సిఎం జగన్ కృషి వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. పేదల కోసం ఇటీవలే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చామన్నారు.  తాము చేస్తున్న పథకాలు చూసి తట్టుకోలేకే ఇలాంటి వ్యాఖ్యలు హరీష్ రావు చేస్తున్నారని, ఒక్కసారి ఏపీకి వచ్చి కనీసం పది  ఇళ్ళు తిరిగాలన్నారు. ఇలాంటి దౌర్భాగ్యపు మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్