Monday, June 17, 2024
HomeTrending Newsలోకేష్...నోరు అదుపులో పెట్టుకో: కాకాణి ఫైర్

లోకేష్…నోరు అదుపులో పెట్టుకో: కాకాణి ఫైర్

ఎవరు ఫేక్ నా కొడుకులో రాష్ట్ర ప్రజలకు, సమాజానికి బాగా తెలుసని, చంద్రబాబు కుటుంబానికి ఉన్న క్రెడిబులిటీ ఏమిటో, క్యారెక్టర్ ఏమిటో కూడా అందరికీ తెలుసని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నిన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించిన లోకేష్ సిఎం జగన్, వైసీపీ నేతలపై చేసిన విమర్శలను  ఆయన తీవ్రంగా ఖండించారు. . “అసలు లోకేష్ అనేవాడు ఎవడు, ఎక్కడ గెలిచాడు, ఏ ప్రజా ఉద్యమాల నుంచి వచ్చాడు, వార్డు మెంబరుగా కూడా గెలవనటువంటి వాడు నెల్లూరు వచ్చి, ముఖ్యమంత్రిని, మంత్రిని, స్థానిక ఎమ్మెల్యేను ఫేక్ నా కొడుకులు.. అని నోటికొచ్చినట్లు మాట్లాడతాడా.. ?, ఇప్పటికైనా లోకేష్ వళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకోవాలి..” అంటూ  ఫైర్ అయ్యారు.  కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్‌ షా  నేతృత్వంలో   ఢిల్లీ లో జరిగిన అన్ని రాష్ట్రాల సహకార శాఖ మంత్రుల సమావేశంలో కాకాణి పాల్గొన్నారు. అనంతరం ఏపీ భవన్ లో  మీడియాతో మాట్లాడారు.

గతంలో చంద్రబాబు పిక్ పాకెట్లు కొట్టుకునే వాడని ఆ జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారని, బాబు తండ్రి ఖర్జూరనాయుడు రాత్రి వేళల్లో రైతుల పొలాల్లో ఉంచిన వేరు శెనగ బస్తాలను దొంగలించేవాడని కాకాణి దుయ్యబట్టారు. చంద్రబాబు పుట్టుకే.. ఈ రాష్ట్రానికి శాపంగా పరిణమించిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్ లు తెలుగుదేశం పార్టీకి కాదని,  అఖిల భారత దరిద్ర సంఘానికి అధ్యక్ష, కార్యదర్శులుగా తయారయ్యారని తూర్పారబట్టారు.

చంద్రబాబు నాయుడు తన కొడుక్కి ఎలాంటి సంస్కారం నేర్పించాడని నిలదీశారు. ‘ఆ పిల్లాడు ఫేక్‌ నా కొడుకులు.. అని వాగుతున్నాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తి కొడుకు, ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నవాడు… బహిరంగ వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు, నోరు అదుపులో ఉండకపోవడం సిగ్గుచేటు. ఫేక్ నా కొడుకులు.. అన్న పదం ఎంత అభ్యంతరకరమైనదో అందరికీ తెలుసు. అసలు ఫేక్‌ నా కొడుకులు ఎవరనేది రాష్ట్ర ప్రజలుకు బాగా తెలుసు. ఈ సమాజానికి తెలుసు. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు.

Also Read : అప్పుడు బై బై బాబు, ఇప్పుడు ఫర్గెట్ బాబు: కాకాణి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్