Saturday, May 11, 2024
HomeTrending Newsఆరోగ్యశ్రీ పరిధిలోకి ఎయిమ్స్‌ :  మంత్రి రజని

ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఎయిమ్స్‌ :  మంత్రి రజని

మంగళగిరిలోని ఎయిమ్స్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంలోనే ఎయిమ్స్‌ లో మౌలిక సదుపాయాలు కల్ప‌న జ‌రిగింద‌న్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ను మంత్రి రజిని నేడు సందర్శించారు. అన్ని విభాగాలను సందర్శించి రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

విభజన చట్టం ప్రకారం ఎయిమ్స్‌ ఏపీకి హక్కుగా వచ్చిందని, తమ ప్రభుత్వ హయాంలోనే ఎయిమ్స్‌ లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. రూ.55 కోట్లతో ఎలక్ట్రిసిటీ, రోడ్స్, డ్రైన్స్‌ వంటి తదితర సదుపాయాలు పూర్తిగా కల్పించామన్నారు. ఇంకా ఏం కావాలో ఆస్పత్రిని యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నామని, ఏఎంఆర్‌ (యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌)కు సంబంధించి ఎయిమ్స్‌ తో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకోబోతుందని వెల్లడించారు.

ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఎయిమ్స్‌ ను తీసుకు రావడం ద్వారా ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలను కల్పించే అవకాశం ఉంటుందని రజని చెప్పారు. శాతం ఈ విషయంలో మేనేజ్‌మెంట్, డైరెక్టర్‌ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఎయిమ్స్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్