Sunday, January 19, 2025
HomeTrending Newsదేశ వాణిజ్యంలో విశాఖది కీలక పాత్ర : మోడీ

దేశ వాణిజ్యంలో విశాఖది కీలక పాత్ర : మోడీ

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని, దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ప్రతిభ చాతుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కితాబిచ్చారు. సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో తమ సత్తా ప్రదర్శిస్తున్నారని అన్నారు. వారి ఉన్నత వ్యక్తిత్వమే వారిని ప్రత్యేకంగా నిలుపుతోందని వ్యాఖ్యానించారు. రూ10,742 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు పథకాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ ప్రాంగణంలో జరిగిన సభలో మోడీ మాట్లాడారు.

కొద్ది నెలలక్రితం ఈ రాష్ట్రంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనే అవకాశం కలిగిందని, ఇప్పుడు మరోసారి ఇక్కడకు రావడం ఆనందంగా ఉందన్నారు.  విశాఖ పోర్టు ద్వారా  రోమ్ వరకూ వ్యాపారం అనేది ఎప్పటినుంచో జరుగుతూ వస్తోందని, ఇప్పటికీ ఈ నగరం దేశం వాణిజ్య రంగంలో ఓ కీలక భూమిక పోషిస్తోందని చెప్పారు. వెంకయ్యనాయుడు, హరిబాబులు ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం తపించేవారని, ఎప్పుడు కలిసినా ఏపీ గురించి, కొత్త  ప్రాజెక్టుల గురించి మాట్లాడేవారని మోడీ గుర్తు చేసుకున్నారు.

మోడీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

వికసించిన  భారత్ అనే అభివృద్ధి సూత్రంతో ముందడుగు వేస్తున్నాం

సమ్మిళిత అభివృద్ధి మా లక్ష్యం

రైల్వే, రోడ్లు, పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం

మౌలిక సదుపాయాలతో ఆధునిక భారత్ ను ఆవిష్కరిస్తున్నాం

మిషన్ గతి శక్తిద్వారా ప్రాజెక్టుల్లో వేగం పెంచాం

ప్రపంచంలోని మేధావులు, నిపుణులు భారత్ ను ప్రశంశిస్తున్నారు.

సామాన్య మానవుడి జీవితం మెరుగు పరచడమే లక్ష్యం

రైతులకు ఏటా రూ.6వేల రూపాయలు పిఎం కిసాన్ యోజన ద్వారా అందిస్తున్నాం

మత్స్య కారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఉపయోగపడుతున్నాయి

విశాఖ రైల్వే స్టేషన్ తో పాటు, పోర్టును కూడా ఆధునీకరిస్తున్నాం

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో తమ ప్రతిభ చాటుతున్నారు

స్నేహపూర్వకంగా ఉండడం ఇక్కడి ప్రజల విశిష్టత

ఏపీలో రూ. 10 వేల కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాం, వీటితో ఏపీ అభివృద్ది కొత్త శిఖరాలకు చేరుతుంది

Also Read : మీతో అనుబంధం రాజకీయాలకు అతీతం: జగన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్