New Innovation: సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న నేరాల నియంత్రణకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అత్యాదునిక సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ త్వరలోనే ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్ వెల్లడించారు.
లాటరీ మెయిల్స్, వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు, సెల్ ఫోన్ల లావాదేవీలపై కన్ను, భద్రతా పరమైన నేరాలపై గోప్యత, OTP మోసాలు, కోవిడ్ టీకా సంబంధిత మోసాలు, ఆధార్ అనుసంధానం, భీమా సంస్థల పేరుతో మోసాలు, ప్రభుత్వ పధకాల పేర్లతో మోసాలు, BIT Coin మోసాలు, చిన్నారులు, మహిళలు, గృహిణుల పట్ల అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలు, విచ్చలవిడిగా మార్ఫ్ డ్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వంటి అనేక నేరాలకు పాల్పడుతున్నారని పోలీసు శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచన మేరకు ఈ సైబర్ నేరాలను నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన Cyber Crime Investigation Tools, Disk Forensics Tools, Mobile Forensic Tools, Password Recovery Tools, CDR Analysis Tools, Image Enhancement Tools, OS INT Tools, Proxy server Identity Tools, E-mail Tools, Social media Tools తో కూడిన సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని డిజిపి వివరించారు. వీటికి ఫోరెన్సిక్ వర్క్ స్టేషన్, లాప్ టాప్, హై ఎండ్ కంప్యూటర్ వంటి ఆధునిక హార్డ్ వేర్ ను అందిస్తామన్నారు.వైఎస్ జగన్
మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్నిగౌతం సవాంగ్ ఆన్ లైన్ ద్వారా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా PTC విజయనగరం లో 100 , PTC ఒంగోలులో 100, PTC అనంతపురంలో 100 మందికి శిక్షణ పొందుతారు. మొత్తం 20,000 మందిని ఎంపిక చేసి విడతలవారీగా సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ, సోషల్ మీడియా నేరాల నియంత్రణపై అత్యంత అనుభవం కలిగిన సు శిక్షితులైన వారిచేత శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.
Also Read : ‘ఐటిసి’తో సుదీర్ఘ భాగస్వామ్యం: సిఎం జగన్