CM letter on Floods:
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, తక్షణ సాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలకు లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం వివిధ రంగాలకు 6,054 కోట్ల రూపాయల నష్టం జరిగిందని, సష్టం అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని సిఎం కోరారు.
నాలుగు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 225శాతం అధికంగా నమోదైందని, చాలా ప్రాంతాల్లో 20 సెంటిమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడిందని లేఖలో సిఎం వివరించారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రహదారులు కోతకు గురయ్యాయని, చెరువులు, కాల్వలకు గండి పడిందని, 196 మండలాలు నీట మునిగాయని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీవ్ర నష్టం జరిగిందని, ప్రభుత్వం మొత్తం 324 సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
సిఎం రాసిన లేఖలో వివిధ రంగాలకు వాటిల్లిన నష్టం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. (రూపాయలు కోట్లలో)
పంట నష్టం-రూ.1353.82; హార్టీకల్చర్ – రూ.48.06; రోడ్లకు – రూ.1756; నీటిపారుదల – రూ.556.96
విద్యుత్ శాఖా – రూ.252.02; పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా – రూ. 453.33; గ్రామీణ రహదారులు- రూ.381.65; పురపాలక శాఖ (పట్టణ రహదారులు, పైప్ లైన్, డ్రైనేజి, భవనాలు)- రూ.1252.02
Also Read : 25 లక్షల పరిహారం ఇవ్వండి: బాబు డిమాండ్