Monday, February 24, 2025
HomeTrending Newsఏపీకి మంచి రోజులు : పవన్ విశ్వాసం

ఏపీకి మంచి రోజులు : పవన్ విశ్వాసం

భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ కు మంచిరోజులు వస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అనంతరం నోవాటెల్ హోటల్ వద్ద పవన్ మీడియాతో క్లుప్తంగా మట్లాడారు. 2014లో ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యానని, ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ కలుసుకున్నానని, రాష్ట్రంలోని పరిస్థితులపై వివరాలు చెప్పానని, ఆంధ్ర ప్రదేశ్ బాగుండాలని, తెలుగు ప్రజలు బాగుండాలని ప్రధాని ఆకాంక్షించారని పవన్ చెప్పారు. ప్రధాని అన్ని విషయాలూ అడిగి తెలుసుకున్నారని, తనకున్న అవగాహన మేరకు తానుకూడా చెప్పానని పవన్ వ్యాఖ్యానించారు.

రెండ్రోజుల క్రితం ప్రధాని కార్యాలయం నుంచి కలవాల్సిందిగా పిలుపు వచ్చిందని దాని మేరకు తాను కలిశానని వెల్లడించారు. మోడీతో తన భేటీ ఏపీకి మంచి చేస్తుందని పవన్ విశ్వాసం వెలిబుచ్చారు.

Also Read : సవాళ్ళకు సిద్ధం : పవన్ కళ్యాణ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్