Sunday, January 19, 2025
HomeసినిమాAparna Das: వైష్ణవ్ తేజ్ మూవీలో అపర్ణా దాస్

Aparna Das: వైష్ణవ్ తేజ్ మూవీలో అపర్ణా దాస్

మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అపర్ణా దాస్ ‘PVT04’ చిత్రంతో తెలుగు సినీరంగ ప్రవేశం చేస్తోంది.  ఎంతో ప్రతిభ గల ఈ నటిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం ఆనందంగా ఉందని.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తెలియచేశాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

వైష్ణవ్ కు ఇది నాలుగో సినిమా.. అపర్ణా దాస్ వజ్ర కాళేశ్వరి దేవి పాత్రను దీనిలో పోషిస్తున్నారు. సినిమాకి ఎంతో కీలకమైన పాత్రలో నటిస్తున్న అపర్ణ, తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో పాత్రకు న్యాయం చేస్తుందని చిత్ర బృందం విశ్వసిస్తోంది. అపర్ణ ఇటీవల తమిళంలో నటించిన ‘దాదా’ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు సినీ ప్రేమికులు తప్పక థియేటర్లలో చూసి ఆనందించదగ్గ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న PVT04 కి అపర్ణా దాస్ రాక మరింత ఆకర్షణ అవుతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్