Saturday, January 18, 2025
Homeసినిమా'దేవర' కూడా రొమాంటిక్ హీరోనే! 

‘దేవర’ కూడా రొమాంటిక్ హీరోనే! 

ఎన్టీఆర్ అభిమానులంతా ఆయన తాజా చిత్రంగా రూపొందుతున్న ‘దేవర’ కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన షూటింగు చకచకా జరిగిపోతూనే ఉంది. కొరటాల శివ దర్శత్వం  వహిస్తున్న సినిమా ఇది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ తరువాత ఎన్టీఆర్ తో కోరటాల రూపొందిస్తున్న సినిమా ఇది. ఇక ‘ఆర్ ఆర్ ఆర్’ వంటి పాన్ ఇండియా సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం వలన కూడా ఈ ప్రాజెక్టు ప్రత్యేకతను సంతరించుకుంది.

ఇప్పటివరకూ ఈ సినిమాకి సంబంధించి వదిలిన అప్ డేట్స్ లో, మాస్ యాక్షన్ కి ‘దేవర’ బ్రాండ్  అంబాసిడర్ అన్నట్టుగానే చూపిస్తూ వచ్చారు. కత్తులు .. గొడ్డళ్లు .. సముద్ర తీరం ఎర్రబడటం వంటి సన్నివేశాలను చూపిస్తూ వచ్చారు. రొమాన్స్ కి ‘దేవర’ దూరంగా ఉంటున్నాడే అనే ఆలోచన ఆడియన్స్ లో వచ్చేసింది. వాళ్లందరికీ కాస్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టే వార్త ఏమిటంటే, యాక్షన్ స్థాయిలోనే రొమాన్స్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

దేవరకి .. హీరోయిన్ కి మధ్య సహజంగానే లవ్వు ఉంటుంది. లవ్వు కున్న లక్షణమే రొమాన్స్ దిశగా నడిపించడం కాబట్టి, ఆ దిశగా హీరోహీరోయిన్స్ పరుగులు పెడతారట. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరికీ సంబంధించిన ఒక రొమాంటిక్ సాంగ్ ను ఈ నెల 4వ వారం నుంచి చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఈ రొమాంటిక్ సాంగ్ మాస్ తోను .. యూత్ తోనూ విజిల్స్ వేయిస్తుందని చెబుతున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, అక్టోబర్ 10వ తేదీన థియేటర్లకు రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్