Wednesday, May 29, 2024
HomeTrending Newsఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరణ

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరణ

ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. బెయిల్‌ ఇచ్చేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టు నిరాకరించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై బెయిల్‌ నిరాకరిండంతో పాటు పిటిషన్లను తిరస్కరిస్తూ న్యాయమూర్తి కావేరి భవేజా తుది తీర్పు వెల్లడించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో పిటిషన్‌ దాఖలు చేయగా వాటిని తిరస్కరించింది.

లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరపున స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని కవిత తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మహిళగా పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకార్‌ బెయిల్‌కు అర్హత ఉందని తెలిపారు. ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని, అరెస్టు సరైన కారణాలు లేవని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని.. దర్యాప్తు ప్రభావితం చేస్తారని సీబీఐ, ఈడీ వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో వాదనలు విన్న కోర్టు బెయిల్‌ను తిరస్కరిస్తూ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. మద్యం పాలసీ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్‌ జైలులో ఉన్నారు. రేపటితో ఆమె కస్టడీ ముగియనుంది. దీంతో మరోసారి ఆమెను న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు.

100 కోట్ల లంచం సొమ్మును సౌత్ గ్రూప్ సిండికేట్ నుంచి కవిత వసూలు చేశారని ఈడి అధికారులు అభియోగం మోపారు. ఈ వ్యవహారంలో పైసా పెట్టుబడి లేకుండానే కవిత ఇండోస్పిరిట్‌లో 33 శాతం వాటా దక్కించుకున్నారని ఆరోపించారు.

ఇదే కేసులో కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇతర మద్యం వ్యాపారస్తులు అరెస్టయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21న అరెస్టయ్యారు. ఆయన బెయిల్ కోసం పెట్టుకోగా ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 9న కొట్టేసింది. లోక్ సభ ఎన్నికల వేళ తనపై రాజకీయ కక్ష సాధిస్తున్నారన్న ఆయన వాదనను కోర్టు తిరస్కరించింది. శుక్రవారం సుప్రీం కోర్టు కేజ్రీవాల్ వినతి విషయంలో స్పందించింది. ఆయన తాత్కాలిక బెయిల్ వాదనలను మే 7న పరిశీలిస్తామని తెలిపింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్