Gayathri also: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీల పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు రేపు ఉగాది రోజున గ్రాండ్ గా ప్రారంభం కానుంది. మేకర్స్ ప్రకటించినట్లుగా, సినిమా ప్రీ లుక్ కూడా విడుదల కాబోతోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పకులు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ ఈ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది. నూపూర్ కి లాగే గాయత్రీ భరద్వాజ్ కి కూడా ఇది మొదటి సినిమా. సినిమాలో ఇద్దరు హీరోయిన్లకూ నటించేందుకు మంచి స్కోప్ ఉంది. గాయత్రీ భరద్వాజ్ fbb కలర్స్ ఫెమినా మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2018గా ఎంపికైంది. ఆమె సెఫోరా మిస్ గ్లామరస్ లుక్, జియో మిస్ పాపులర్, కొడాక్ లెన్స్ మిస్ స్పెక్టాక్యులర్ ఐస్, మిస్ ఇండియా ఢిల్లీ 2018 మొదలైన టైటిళ్లను కూడా గెలుచుకుంది.

ఆమె నటించిన వెబ్ సిరీస్ దిండోరాలో తన నటనకు ప్రశంసలు అందుకుంది. టైగర్ నాగేశ్వరరావు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనుంది. ఇది రవితేజకు మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. R Madhie ISC కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. మయాంక్ సింఘానియా సహ నిర్మాత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *