Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్జాబ్ క్యాలెండర్ పై విమర్శలా?: ఏపీఎన్జీఓ నేతలు

జాబ్ క్యాలెండర్ పై విమర్శలా?: ఏపీఎన్జీఓ నేతలు

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై ప్రతిపక్షాల విమర్శలు అర్ధరహితమని, ప్రభుత్వం చేసే ప్రతీ పనిని విమర్శించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని ఏపీఎన్జీఓ నేతలు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం హయంలో కారుణ్య నియామకాలు, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ నియామకాలు జరిగాయని వెల్లడించారు. తమకు ఇష్టమైన వారిని నియమించుకోవడం తప్ప రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాల కల్పన జరగలేదని అన్నారు.

గాంధీజీ కలలు కన్న స్వరాజ్య స్థాపన కొరకు గ్రామ, వార్డ్ సచివాలయాలు ఏర్పాటు చేసి సుమారు 4,00,000 మందికి ఉద్యోగాలు కల్పించారని, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వారికి ప్రత్యేకంగా APCOS ఏర్పరిచి తద్వారా సుమారు 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించాయని, మిగిలిన శాఖలలో మరో లక్షకు పైగా ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఎలాంటి దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నియామకాలు చేశారని ఉద్యోగ సంఘ నేతలు వివరించారు. అదే విధంగా సుమారు 60,000 మంది RTC ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులగా మార్చటం అనేది సాహోసేపేతమైన నిర్ణయమని పేర్కొన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులను త్వరలో క్రమబద్దికరించుటకు తగు చర్యలు తీసుకుంటున్నామని, అవుట్ సోర్చింగ్ ఉద్యోగులు భద్రతకు చర్యలు చేపడుతున్నామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తమకు హామీ ఇచ్చారని వారు తెలిపారు. మరియు పెండింగ్ లో వున్నట్టువంటి డి.ఏ ల చెల్లింపు మరియు 11th PRC అమలు విషయమై త్వరలో ఉద్యోగ సంఘాలతో చర్చించి మెరుగైన PRC ని ప్రకటిస్తానని హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. అలాగే CPS రద్దుపై కుడా ఉన్నతస్థాయి కమిటి నివేదిక ప్రకారం న్యాయ పరమైన సమస్యలు తలెత్తకుండా అందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు APNGOs’ రాష్ట్ర సంఘం అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు APNGOs’ రాష్ట్ర సంఘం అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు శ్రీ నలమారు చంద్ర శేఖర్ రెడ్డి మరియు శ్రీ బండి శ్రీనివాస రావు లు పేర్కొన్నారు.

కరోనా వలన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సరిగా లేనప్పట్టికి ఇచ్చిన మాట ప్రకారం అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేయటానికి ఈ ప్రభుత్వం శాయ శక్తులా కృషి చేస్తున్నదని, నిరుద్యోగులు ఎవరు ప్రతిపక్షాల ఉచ్చులో పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘ నాయకులుగా ప్రభుత్వం విడుదల చేసిన జాబు కేలండర్ ను తాము స్వాగతిస్తున్నామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్