Saturday, January 18, 2025
HomeTrending Newsకూనూరులో కూలిన డిఫెన్స్ హెలికాఫ్టర్

కూనూరులో కూలిన డిఫెన్స్ హెలికాఫ్టర్

Army Chopper crashed :

రక్షణ శాఖకు చెందిన ఓ హెలికాఫ్టర్ తమిళనాడులోని కూనురులో కుప్పకూలింది. హెలికాఫ్టర్ నుంచి తీవ్రంగా మంటలు వచ్చాయి. ఈ చాపర్ లో ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రయాణ సమయంలో మొత్తం 14 మంది ఉన్నట్లు ఆర్మీ అధికారులు చెబుతున్నారు. వీరిలో ఇప్పటికి నలుగురు మరణించారని, ఆస్పత్రికి తరలించిన మరోముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.

ఆర్మీ అధికారులకు ఓ అంశంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఆర్మీ ఉన్నతాధికారులు అందరూ కూనూరుకు బయల్దేరినట్లు తెలుస్తోంది. అందరూ ఒకేసారి, ఒకే హెలికాఫ్టర్ లో ఎందుకు పయానిస్తున్నరనే అనుమానం వ్యక్తం అవుతోంది.

చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో సహా పలువురు అధికారులు పయనిస్తున్న ఐఎఎఫ్ ఎంఐ – 17వి5 హెలికాఫ్టర్ క్రాష్ అయినట్లు ఆర్మీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్