Sunday, January 19, 2025
Homeసినిమాపుష్ప 2 లో మరో హీరో..?

పుష్ప 2 లో మరో హీరో..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప దేశ వ్యాప్తంగానే కాకుండా.. విదేశాల్లో సైతం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవల రష్యాలో రిలీజై అక్కడ కూడా మంచి ఆదరణ సంపాదించింది.  ఈ సినిమాలోని తగ్గేదేలే… అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయ్యింది.  దీంతో ‘పుష్ప 2’పై మరింత క్రేజ్ పెరిగింది.

ఇప్పుడు పుష్ప 2 గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తెలిసింది. లోకేష్ కనకరాజ్ తను చేస్తున్న సినిమాలతో ఓ యూనివర్శ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇటీవల హిట్ మూవీ దర్శకుడు శైలేష్ కొలను కూడా హిట్ యూనివర్శ్ ను క్రియేట్ చేస్తున్నాను. వరుసగా హిట్ మూవీకి సీక్వెల్స్ గా హిట్ 7 వరకు వస్తాయని చెప్పాడు. ఇదే తరహాలో పుష్ప యూనివర్స్ సుకుమార్ క్రియేట్ చేస్తున్నారట. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. త్వరలో పుష్ప 2 మూవీ షూటింగ్ లో అల్లు అర్జున్ జాయిన్ అవుతారు.

అయితే… పుష్ప 2 క్లైమాక్స్ లో మరో హీరోను రంగంలోకి దింపే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు.. రంగస్థలం చిట్టిబాబుని రంగంలోకి దింపే ఛాన్స్  ఉన్నట్లు టాక్ బయటకు వచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప, రంగస్థలం.. ఈ రెండు చిత్రాలు కూడా 80, 90 ల కాలంలో జరిగిన కథలు కాబట్టి వాటికి తగ్గట్టుగానే సుకుమార్ ఈ విధంగా ప్లాన్ చేసి ఉంటాడు అంటున్నారు. ఇది నిజమో కాదో తెలియదు కానీ.. అదే కనుక జరిగితే… సంచలనమే.

Also Read : పుష్ప 2 లో కేథరిన్..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్