Sunday, January 19, 2025
Homeసినిమా'...వీరయ్య'లో రవితేజ పాత్ర నిడివి ఎంత?

‘…వీరయ్య’లో రవితేజ పాత్ర నిడివి ఎంత?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి ‘అన్నయ్య’లో నటించారు. వీరిద్దరూ అన్నదమ్ములుగా నటించి, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 22 ఏళ్ల క్రితం.. 2000లో సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజైంది. మళ్లీ ఇప్పుడు చిరంజీవి, రవితేజ కలిసి నటించడం ఓ విశేషమైతే.. ఈ సినిమా కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుండడం మరో విశేషం. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్  నిర్మిస్తున్న  ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది.

ఈ సినిమాలో రవితేజ గెస్ట్ రోల్ చేస్తున్నారా..? ఫుల్ లెంగ్త్ రోలా..? ఇది చిరంజీవి సోలో మూవీనా..? మల్టీస్టారర్ మూవీనా..? అనేది ఆసక్తిగా మారింది. రవితేజ పాత్రకు సంబంధించి ఇటీవల టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో రవితేజ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో శాంపిల్ చూపించారు. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి రవితేజ ఎంతసేపు కనిపిస్తాడు..?  అసలు రవితేజ క్యారెక్టర్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఇదే విషయం గురించి ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే… చిరంజీవి, రవితేజ ఇద్దరూ సవతి తల్లి సోదరులుగా కనిపించబోతున్నారట.

అంతే కాకుండా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సాగర్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ క్యారెక్టర్ నిడివి ఎంత అంటే.. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ నిడివి 44 నిమిషాలని.. అంతే కాకుండా చాలా పవర్ ఫుల్ సీన్ లలో రవితేజ కనిపిస్తాడని.. అన్నీ సీన్స్ చిరు కాంబినేషన్ లోనే వుంటాయిని తెలిసింది. ఇద్దరి కాంబినేషన్ లో పూనకాలు లోడింగ్ అనే సాంగ్ కూడా వుంటుందని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్