Sunday, June 2, 2024
Homeసినిమానర్తన్ సినిమాలో చరణ్ కాదు... విజయ్?

నర్తన్ సినిమాలో చరణ్ కాదు… విజయ్?

రామ్ చరణ్‌ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే.. దీని తర్వాత బుచ్చిబాబుతో సినిమా ప్రకటించారు కానీ.. గత కొన్ని రోజులుగా కన్నడ డైరెక్టర్ నర్తన్ పేరు వినిపించింది.  బుచ్చిబాబు-నర్తన్ ల్లో ఎవరితో ముందుగా సినిమా ఉంటుందని సందేహాలు తలెత్తాయి.

అయితే నర్తన్  తో చరణ్‌ మూవీ ఉంటుందని, యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని తెలిసింది.  ఇదిలా ఉంటే.. నర్తన్ తో ఓ మూవీ చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని ఓ కన్నడ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించాలనుకుంటున్నారని తెలిసింది. ఇందులో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లాయర్ క్యారెక్టర్ చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం నర్తన్ స్ర్కిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి నర్తన్ చరణ్ తోనూ, విజయ్ దేవరకొండతోనూ రెండు సినిమాలు చేయనున్నారా..? లేక ఒక సినిమానే చేయనున్నాడా..? ఒకవేళ రెండు సినిమాలు చేస్తే.. ముందు ఎవరితో సినిమా చేయనున్నాడు..? అనేది ఆసక్తిగా మారింది.

చరణ్‌ శంకర్ తో మూవీ తర్వాత బుచ్చిబాబుతో సినిమా ఉంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ అంటూ జాన్వీ పేరు వినిపిస్తోంది. బుచ్చిబాబు ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. కొత్త సంవత్సరంలో సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు. అలాగే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయాల్సివుంది. అయినప్పటికీ ఈ కన్నడ డైరెక్టర్ నర్తన్ చరణ్‌ తో మూవీ, విజయ్ దేవరకొండతో మూవీ అని గట్టిగా టాక్ వినిపిస్తోంది. మరి.. ఇద్దరిలో ఎవరితో నర్తన్ మూవీ ముందుగా ఉంటుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్