కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్య స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ‘గని’ సినిమా చేసినా అది ఏమాత్రం మెప్పించలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. సినిమాలతోపాటు వ్యక్తిగత అంశాలతో కూడా వరుణ్ వార్తల్లో నిలుస్తున్నాడు.
గత కొంతకాలంగా వరుణ్ తేజ్ పెళ్లి వార్తల్లో నిలుస్తుంది. ఆమధ్య నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి గురించి మేము కాదు అతనే చెబుతాడని చెప్పారు. అప్పటి నుంచి వరుణ్ తేజ్ ఎవర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు..? లవ్ మ్యారేజా..? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడా..? అనేది ఆసక్తిగా మారింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కొంతకాలంగా లవ్ లో ఉన్నారని.. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను వారిద్దరూ ఖండించకపోవడంతో ఇది నిజమే అనిపిస్తుంది.
మెగా ఫ్యామిలీతో పాటు అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో వచ్చే నెలలో వరుణ్, లావణ్యల ఎంగేజ్ మెంట్ జరగనుందని ప్రచారం జరుగుతుంది. ఈ సంవత్సరం చివరిలో పెళ్లి చేసుకోనున్నారని టాక్ వినిపిస్తుంది. అసలు వీరిద్దరికీ ఎలా సెట్ అయ్యిందంటే.. అంతరిక్షం, మిస్టర్ చిత్రాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందట. ఈ విషయం గురించి నిహారికను ఓ ఇంటర్ వ్యూలో అడిగితే.. స్పందించలేదు. మరి.. వరుణ్ తేజ్, లావణ్య ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.