Saturday, January 18, 2025
Homeసినిమాకేజీఎఫ్ హీరో య‌ష్ నెక్ట్స్ మూవీ శంక‌ర్ తో ఫిక్స్ అయ్యిందా..?

కేజీఎఫ్ హీరో య‌ష్ నెక్ట్స్ మూవీ శంక‌ర్ తో ఫిక్స్ అయ్యిందా..?

Yash-Shankar: ‘కేజీఎఫ్’తో క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్ సంచ‌ల‌నం సృష్టించారు. అప్ప‌టి వ‌ర‌కు క‌న్న‌డ ఇండ‌స్ట్రీకే తెలిసిన య‌ష్ నేమ్ కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. ఇప్పుడు య‌ష్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది. కేజీఎఫ్ మూవీని అందించిన సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం స‌లార్ మూవీ చేస్తున్నారు. ఆత‌ర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేయ‌నున్నారు. ఆత‌ర్వాత చ‌ర‌ణ్ తో ప్ర‌శాంత్ నీల్ మూవీ ఉంది.

ఇలా ప్ర‌శాంత్ నీల్ బాగా బిజీగా ఉండ‌డంతో య‌ష్ ఎవరితో చేస్తాడు అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే.. క‌న్న‌డ డైరెక్ట‌ర్ నర్తన్ తో య‌ష్ ఓ మూవీ చేయ‌నున్నార‌ని ఆమ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. ఇందులో యష్ నేవీ ఆఫీసర్ పాత్రను పోషిస్తాడట‌. ఈ భారీ బడ్జెట్ కన్నడ చిత్రాన్ని ఆయన అభిమానుల కోసం ఇతర భాషల్లోకి కూడా డబ్ చేయనున్నారు. దర్శకహీరోలు ఇరువురూ కలిసి చాలా సార్లు కనిపించారు కానీ ఇంకా ఈ ప్రాజెక్ట్ పై ఏదీ ధృవీకరించలేదు. కథానాయికగా నటించేందుకు పూజా హెగ్డేని సంప్రదించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు శంకర్ తో యష్ పాన్ ఇండియా మూవీ చేయ‌నున్న‌ట్టుగా టాక్ గ‌ట్టిగా వినిపిస్తోంది. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఆత‌ర్వాత‌ భారతీయుడు 2తో కంప్లీట్ చేస్తారు. యష్.. శంకర్ ఎవరికి వారు బిజీ. అందుకే ప్రస్తుత ప్రాజెక్ట్ లను పూర్తి చేసిన తర్వాత కలిసి పని చేసేందుకు ఆస్కారం ఉందని టాక్ వినిపిస్తోంది. మరో వైపు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు  యష్‌  కోసం 100 కోట్ల బడ్జెట్ తో ద్విభాషా  చిత్రానికి ఆఫర్ చేసినట్లు..శంకర్ తో యష్‌ ని కలిపేది కూడా ఆయనే అనే టాక్ ఉంది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న‌ది వాస్త‌వ‌మేనా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

Also Read : ప్ర‌భాస్ మూవీలో య‌శ్? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్