Wednesday, September 25, 2024
Homeసినిమాఫిబ్ర‌వ‌రి 4న‌ ‘అతడు ఆమె ప్రియుడు’

ఫిబ్ర‌వ‌రి 4న‌ ‘అతడు ఆమె ప్రియుడు’

ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహించిన వినూత్న కథా చిత్రం ‘అతడు-ఆమె-ప్రియుడు’. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో… రవి కనగాల – రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విభిన్న కథాచిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ – రిలీజ్ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, రచయిత విజయేంద్రప్రసాద్, దర్శకులు దశరథ్, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

రచయితగా ఎన్నో సంచలనాలు సృష్టించిన యండమూరి…. దర్శకుడిగాను “అతడు ఆమె ప్రియుడు” చిత్రంతో సంచలనాలకు శ్రీకారం చుట్టాలని అతిధులు ఆకాంక్షించారు. ఈ చిత్రం కోసం యండమూరి ఎంతో శ్రమించారని, సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారని నిర్మాతలు రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి పేర్కొన్నారు. యండమూరితో మరికొన్ని చిత్రాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. “అతడు ఆమె ప్రియుడు” చిత్రాన్ని ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తున్నామని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్