Saturday, November 23, 2024
HomeTrending Newsఓట్ల శాతం పెరిగింది: అచ్చెన్నాయుడు

ఓట్ల శాతం పెరిగింది: అచ్చెన్నాయుడు

TDP Improved:
మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని, 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే ఏడింటిలో హోరాహోరీ పోరాటం చేశామని, రెండిటిలో విజయం సాధించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. కనీసం పోటీ చేయలేని పరిస్థితుల్లోనుంచి ఇలాంటి విజయాలు అందించిన కార్యకర్తలను పార్టీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

మార్చిలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే 30 శాతం ఓట్లు, 12 శాతం సీట్లు వచ్చాయని, ఈ ఏడు మాసాల్లో రాష్ట్రంలో టిడిపి బాగా పుంజుకుందని, తాము 46 శాతం ఓట్లకు పెరిగామని తెలిపారు. నేటి విజయం వైసీపీ విజయం కాదని, పోలీసులు అందించిన విజయమని, ఈ విజయాన్ని డిజిపికి అంకితం చేయాలని వ్యంగ్యంగా చెప్పారు. ప్రజల్లో స్పష్టమైన మార్పు వస్తోందని, దానికి ఈ ఫలితాలే తార్కాణమన్నారు.

కుప్పం ఓటమితో చంద్రబాబు పని అయిపోయిందంటూ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని, కనీసం వెల్లంపల్లి అయినా తన స్థానానికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు?

ఏదైనా ప్రభుత్వానికి చివరి సంవత్సరంలో వ్యతిరేకత వస్తుందని, కానీ జగన్ ప్రభుత్వంపై రెండున్నరేళ్ళలోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందన్నారు. కుప్పంలో గెలుపు చూసి సిఎం, కొందరు మంత్రులు పండుగ చేసుకుంటున్నారని, ఇది కూడా ఒక గెలుపేనా అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. దొంగ ఓట్లతో గెలుపు కూడా ఓ గెలుపేనా అంటూ ప్రశ్నించారు. కుప్పంలో అమాయక మహిళలను వాడుకొని, ఎన్నో అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడి గెలిచారని విమర్శించారు. గుంటూరు నగరంలో తమ పార్టీ కార్పొరేటర్ విజయం సాధించారని చెప్పారు. దాచేపల్లిలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా తొమ్మిది వార్డుల్లో గెలిచామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్