Saturday, January 18, 2025
Homeసినిమాకోలీవుడ్ నుంచి టాలీవుడ్ కి దిగిపోతున్న మరో బ్యూటీ!  

కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కి దిగిపోతున్న మరో బ్యూటీ!  

తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ పరిచయమవుతూనే ఉంటారు. అందంతో పాటు కాస్త అభినయం .. మరికాస్త అదృష్టం ఉన్నవారు ఇక్కడ తమ జోరును కొనసాసగిస్తూ ఉంటారు. ఇటీవలే తెలుగు తెరకి అనిఖ సురేంద్రన్ .. గౌరీ కిషన్ .. ఆషిక రంగనాథ్ పరిచయమయ్యారు. అయితే ఫలితాల పరంగా చూసుకుంటే ముగ్గురికీ కూడా నిరాశనే ఎదురైంది. అయినా ఆ తరువాత అవకాశాలను అందుకోవడానికి ఎవరికి వారు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ‘అతుల్య రవి’ అనే కోలకళ్ల భామ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన ‘మీటర్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తప్పకుండా తనకి మంచి గుర్తింపు వస్తుందనీ, హిట్ కొడతాననే నమ్మకంతో ఆమె ఉంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.

ఇక కిరణ్ అబ్బవరం జోడీగా మరో కొత్త హీరోయిన్ మెరవనుంది. .. ఆ బ్యూటీ పేరే నజియా. కిరణ్ అబ్బవరం చేయనున్న 9వ సినిమాలో ఆమెనే కథానాయికగా. ఇంతకుముందు ఒకటి రెండు తెలుగు సినిమాల్లో కనిపించినప్పటికీ, కథానాయికగా ఆమెకి ఇదే ఫస్టు మూవీ. ఈ రోజునే ఈ సినిమాను లాంచ్ చేస్తున్నారు. శివమ్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహించనున్నాడు. మరి ఈ భామలు ఇక్కడ ఎంతవరకూ సక్సెస్ ను సాధిస్తారనేది చూడాలి.

Also Read : ఆ ఫైట్ సీన్ పూనకాలు తెప్పిస్తుంది: కిరణ్ అబ్బవరం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్