Monday, April 7, 2025
HomeTrending Newsజగన్ ను కలుసుకున్న ఎమ్మెల్యే విక్రమ్

జగన్ ను కలుసుకున్న ఎమ్మెల్యే విక్రమ్

Well Done: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూర్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి  నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. అధికార వైఎస్సార్సీపీ గౌతమ్ సోదరుడు విక్రమ్ కే సీటు కేటాయించింది. జూన్ 23 న ఉప ఎన్నికల పోలింగ్, నిన్న కౌంటింగ్ జరిగింది. మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

విక్రమ్ రెడ్డి, మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వర రావు లతో కలిసి తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో నేడు సిఎం జగన్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ ను జగన్ అభినందించారు. గౌతమ్ బాటలో నియోజక అభివృద్ధికి పాటుపడాలని, తన సంపూర్ణ సహకారం ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్