భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ పై బెంగళూరులో దాడి జరిగింది. రైతు సంబంధిత అంశాలపై ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు ఇంకుతో దాడి చేశారు. నిరసనకారులు లోనికి దూసుకొచ్చి టికాయత్ ముఖంపై నల్లటి ఇంకు చల్లారు. ఇంకు దాడితో షాకైన రైతు సంఘాల ప్రతినిధులు.. దాడి చేసినవారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తీవ్ర గలాటా చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కుర్చీలు విరుసురుకొని ముష్టిఘాతాలకు దిగడంతో అక్కడ వాతావరణం గందరగోళంగా మారింది. ఇంకు నిండిన ముఖంతోనే రాకేశ్ టికాయత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు స్థానిక పోలీసులదే బాధ్యతని ఆరోపించారు.
బెంగళూరు పోలీసులు తమకు ఎలాంటి భద్రతా కల్పించలేదన్న రాకేశ్ టికాయత్.. రైతు నిరసనలకు చిక్కులు సృష్టించాలనే కర్ణాటక ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వంతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. స్టింగ్ ఆపరేషన్‌లో రైతు నాయకుడు ఒకరు డబ్బు అడుగుతూ కెమెరాకు చిక్కారంటూ వచ్చిన ఆరోపణలపై మాట్లాడేందుకు టికాయత్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడినవారు ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా నినాదాలు చేయడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు స్పందించాల్సి ఉంది.
Also Read : పేరుకు ప్రజలది రాజ్యం