Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్Australia Vs South Africa: ఆసీస్ దే సిరీస్

Australia Vs South Africa: ఆసీస్ దే సిరీస్

సౌతాఫ్రికాతో  మెల్ బోర్న్ లో జరిగిన రెండో టెస్టులోనూ ఆతిథ్య ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 182  పరుగులతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 204 పరుగులకే ప్రోటీస్ జట్టు ఆలౌట్ అయ్యింది. బావుమా ఒక్కడే 68 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచారు. వెర్రేఎన్-33;   డే బ్రుయన్-28 పరుగులు చేశారు.  నాథన్ లియాన్ మూడు; స్కాట్ బొలాండ్ రెండు; స్టార్క్, కమ్మిన్స్, స్టీవెన్ స్మిత్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

డబుల్ సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండు టెస్టులు గెల్చుకున్న ఆసీస్ సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ 2023 జనవరి 4 నుంచి సిడ్నీ లో మొదలు కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్