Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్World Cup Hockey: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ విజయం

World Cup Hockey: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ విజయం

ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్ కప్-2023లో  ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తమ ప్రత్యర్ధులపై ఘనవిజయం సాధించారు.  ఆరంభ మ్యాచ్ లో అర్జెంటీనా పై 1-0తో సౌతాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే.

ఇదే స్టేడియంలో (భువనేశ్వర్ కళింగ స్టేడియం) జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ పై ఆసీస్ జట్టు 8-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆసీస్9,27,27, 29, 32, 39, 45, 54 నిమిషాల్లో గోల్స్ సాధించింది. వీటిలో ఐదు ఫీల్డ్ గోల్స్ కాగా, మూడు పెనాల్టీ కార్నర్ ఉన్నాయి. క్రేగ్ టామ్, హేవార్డ్ జెరెమీ చెరో మూడు గోల్స్ చేశారు. క్రెగ్ టామ్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

నేటి మూడో మ్యాచ్ రూర్కెలా లోని బిర్సాముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో జరగ్గా పూల్ డి నుంచి ఇంగ్లాండ్- వేల్స్ జట్లు తలపడ్డాయి. ఇంగ్లాండ్ జట్టు 5-0 తో విజయం సొంతం చేసుకుంది.

1,28.38, 42, 58 నిమిషాల్లో మూడు ఫీల్డ్ గోల్స్, రెండు పెనాల్టీ కార్నర్స్ ద్వారా ఐదు గోల్స్ చేసింది. రెండు గోల్స్ చేసిన అన్సేల్ లియామ్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్