Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్మహిళల వరల్డ్ కప్:  విండీస్ పై గెలిచిన ఆసీస్

మహిళల వరల్డ్ కప్:  విండీస్ పై గెలిచిన ఆసీస్

ICC Women World Cup: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో నేడు జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా 7వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఆసీస్ బౌలర్లు పెర్రీ, గార్డెనర్ ల దెబ్బకు విండీస్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. ముగ్గురు డకౌట్ కాగా, మరో ముగ్గురు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కెప్టెన్ టేలర్ మాత్రమే అర్ధ సెంచరీ (50) తో రాణించింది. క్యాంప్ బెల్లె 20 పరుగులు చేసింది. 45.5 ఓవర్లలో 131 పరుగులకే విండీస్ ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌలర్లలో పెర్రీ, గార్డెనర్  చెరో మూడు; జోనాసేన్ రెండు; ష్కట్ ఒక వికెట్ సాధించారు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు స్కోరు 6,7 వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. అలెస్సా హేలీ-3; కెప్టెన్ లన్నింగ్ డకౌట్ గా వెనుదిరిగారు. బౌలింగ్ లో సత్తా చాటిన పెర్రీ 10 పరుగులు చేసి జట్టు స్కోరు 58 వద్ద ఔటయ్యింది.  ఓపెనర్ రేచల్ హేన్స్-83; బెత్ మూనీ-28 పరుగులతో అజేయంగా నిలిచి గెలిపించారు. 30.2 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి ఆస్ట్రేలియా మహిళల జట్టు విజయం సాధించింది.

పెర్రీకి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్ లు ఆడి, ఒక్క పరాజయం కూడా లేకుండా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి: మహిళల వరల్డ్ కప్: ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా గెలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్