Friday, April 19, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్వారసత్వ సంపద కాపాడాలి: అవంతి

వారసత్వ సంపద కాపాడాలి: అవంతి

మన పూర్వీకులు ఇచ్చిన చారిత్రక, వారసత్వ సంపదను  జాగ్రత్తగా కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందివ్వాల్సిన అవసరం మనపై ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. విశాఖ సమీపంలోని తొట్ల కొండలోని బౌద్ధారామాల కేంద్రంలో పునర్నిర్మించిన మహాస్తూపం, సదుపాయాల కేంద్రాన్ని అవంతి ప్రారంభించారు. కోవిడ్ కారణంగా తగ్గిపోయిన పర్యాటక శాఖ ఆదాయాన్ని పెంచేందుకు సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

⦿ రూ. 20 లక్షలతో ఎమినిటీ సెంటర్ ను ఏర్పాటు చేశారం
⦿ తొట్లకొండకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది, బుద్ధులు ధ్యానం చేసుకున్న పవిత్ర స్థలం
⦿ తొట్లకొండలో మెడిటేషన్ సెంటర్‌ , బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం
⦿ రుషికొండ నుంచి భీమిలి మధ్య ప్రాంతంలో తొట్లకొండ, ఎర్రమట్టి దిబ్బలు వంటి ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నాం
⦿ తొట్లకొండలో వీఎంఆర్డీఏ ఆర్ధిక సహకారంతో మహాస్థూపంతోపాటు 64 స్థంభాల సమావేశ మందిరం, సైన్ బోర్డులు కూడా మరమ్మత్తులు చేశాం
⦿ పర్యాటకుల సౌలభ్యం కోసం కొత్తగా ఒక యాప్‌ను తీసుకువస్తున్నాం
⦿ సెప్టెంబర్ నుంచి నాలుగు నెలలపాటు పర్యాటకులు ఎక్కువగా వస్తారు
⦿ యారాడ నుంచి భీమిలి మధ్యలో దాదాపు 9 బీచ్ లు ఉన్నాయి, వీటిని చెన్నై, కేరళ, గోవా తరహాలో వీటిని అభివృద్ధి చేస్తాం

ఈ కార్యక్రమంలో మేయర్ హరి వెంకట కుమారి, జీవీఎంసీ చీఫ్ విప్, 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక, వీఎంఆర్డీఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, జీవీఎంసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్