Sunday, January 19, 2025
HomeTrending Newsఅయోధ్య దీపోత్సవం ప్రపంచ రికార్డ్

అయోధ్య దీపోత్సవం ప్రపంచ రికార్డ్

Ayodhya Holds The World Record :

దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా అయోధ్య నగరి బుధవారం సాయంత్రం 12 లక్షల దీపాలను వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.

సరయు నది ఒడ్డున రామ్‌కీ పైడితో పాటు ఇతర ఘాట్‌ల చుట్టూ 9 లక్షలకు పైగా మట్టి దీపాలను వెలిగించగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో 3 లక్షల దీపాలను వెలిగించడం ద్వారా ఈ రికార్డును నెలకొల్పారు.

అత్యంత వైభవంగా  జరిగిన ఈ దీపోత్సవం కార్యక్రమంలో అయోధ్య సహా యూపీ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
దీపోత్సవం సందర్భంగా నగరవ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. మొత్తం 12వేల మంది వలంటీర్లు పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్