Wednesday, September 25, 2024
HomeTrending Newsపాత ఇన్సూరెన్స్ నే కొనసాగించాలి: బిటెక్ రవి

పాత ఇన్సూరెన్స్ నే కొనసాగించాలి: బిటెక్ రవి

Crop Insurance:  పంటల బీమా పథకం కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని టిడిపి నేత, ఎమ్మెల్సీ బిటెక్ రవి ఆరోపించారు.    ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం లోప భూ ఇష్టంగా ఉందన్నారు. గతంలో ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పేరుతో ఉన్న ఈ పథకాన్ని వైఎస్సార్ పంటల బీమాగా మార్చారని గుర్తు చేశారు.  అసలు ప్రభుత్వం రైతుల తరఫుల చెల్లిస్తామని చెప్పుకున్న ప్రీమియం ఎవరికి చెల్లిస్తున్నారో కూడా స్పష్టత లేదన్నారు.

ఇన్సూరెన్స్ చెల్లింపులో అసలైన రైతులకు అన్యాయం జరుగుతోందని వైఎస్సార్ పార్టీ మద్దతుదరులకే ఎక్కువగా వస్తోందని విమర్శించారు. అందులోనూ కొన్ని పంటలను మాత్రమే బీమా పరిధి లోకి తీసుకు వచ్చారని, దీనివల్ల చాలా ప్రాంతాల్లోని రైతులకు ఇది అందడం లేదని వివరించారు.  ఇన్ పుట్ సబ్సిడీకి- ఇన్సూరెన్స్ కు తేడా కూడా తెలియదా అంటూ సిఎం జగన్ ను బిటెక్ రవి ప్రశ్నించారు.

ఇన్సూరెన్స్ కంపెనీ లేకపోవడంతో కొంత మొత్తాన్ని బడ్జెట్ లో పెట్టి దాన్నే రైతులందరికీ పంచేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. ఎక్కువ పంట వేసిన దానికి తక్కువ పరిహారం, తక్కువ పంట వేసిన దానికి ఎక్కువ పరిహారం ఇస్తూ రైతులను మోసం చేసున్నారని రవి వ్యాఖ్యానించారు. ఈ-క్రాపింగ్ చేసే విధానం కూడా అస్తవ్యస్తంగా ఉందని, టిడిపి మద్దతు దారులకు పొలాలకు వచ్చి పరిశీలన చేస్తున్నారని, వైఎస్సార్సీపీ వారికి మాత్రం రూమ్ లోనే ఫోటో తీసుకొని పంపుతున్నారని రవి అన్నారు. పాత ఇన్సూరెన్స్ విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పుకునే వైసీపీ రైతులపై కక్ష కట్టిందని. తెలుగుదేశం పార్టీపై ఎలా కక్ష కట్టారో అలాగే రైతులపై కూడా చేస్తున్నారని దుయ్యబట్టారు. జూలై 8,9 తేదీల్లో వేంపల్లె, పులివెందుల పర్యటనకు వస్తున్న సిఎం జగన్ ను ఈ విషయమై రైతులతో కలిసి కలిసేందుకు ప్రయతిస్తామని వెల్లడించారు.

Also Read : ఇంటింటికీ బాదుడే బాదుడు: బాబు  

RELATED ARTICLES

Most Popular

న్యూస్